తుఫానుతో నష్టపోయిన గిరిజన రైతులకు తక్షణ పరిహారం అందించాలి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాడేరు

భారీ తుఫాను కారణంగా నష్టపోయిన గిరిజన రైతు కుటుంబాలకు, ఇల్లు కూలిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. పాడేరు, పెదబయలు మండలాల్లో గిరిజన సమాఖ్య నాయకులు పర్యటించి బాధితుల కష్టాలను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను, కూలిపోయిన ఇళ్లను వెంటనే గుర్తించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.