భక్తి గీతాలతో పులకించిన విజయనగరం వేణుగోపాల్ స్వామి గుడి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

వినాయక చవితి వేడుకల సందర్భంగా విజయనగరం విచ్చేసిన ప్రముఖ సినీ గాయని హారిక ప్రసాదిని స్థానిక వేణుగోపాల్ స్వామి గుడి బృందావన్ అపార్ట్మెంట్లో తన అద్భుతమైన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. మన ఊరు కావడంతో ఆమె ఈ ప్రాంతంపై తన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రమోద్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు. భక్తి పాటలతో పాటు హుషారైన గీతాలు ఆలపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.