మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్లు వెల్లడించారు. తీరంవెంబడి ఈదురుగాలులు వీస్తుండటంతో పాటు గుంటూరు జిల్లా రేపల్లెలో ఓట్ల లెక్కింపును రెండు గంటలు ఆలస్యంగా చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రంలోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.