నిరసనకారులపై దాడి: స్వచ్ఛంద సెలవులోకి సీఎఫ్‌డీఏ సీఈఓ స్టీవెన్ కోల్బ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో జంతు హక్కుల కార్యకర్తలను భౌతికంగా అడ్డుకున్న కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ అమెరికా సీఈఓ స్టీవెన్ కోల్బ్ స్వచ్ఛంద సెలవులోకి వెళ్లారు. సీఓఎస్ ఫ్యాషన్ షో సందర్భంగా పీటా నిరసనకారులపై ఆయన చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. తన చర్యపై కోల్బ్ క్షమాపణలు కోరగా, సంస్థ పూర్తి విచారణ జరుపుతోంది.