రామగిరి మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష దిశానిర్దేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామగిరి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, తాగునీరు, విద్య, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని, డిజిటల్ క్రాప్ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.