యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు, వైద్యులే షాక్!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలో అరుదైన వైద్య ఘటన వెలుగు చూసింది. సంతానలేమి సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన 26 ఏళ్ల యువకుడికి వైద్యులు పరీక్షలు చేయగా షాకింగ్ నిజం తెలిసింది. అతని శరీరంలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. ఇది పీఎండీఎస్ అనే అరుదైన పుట్టుకతో వచ్చే వ్యాధి అని నిర్ధారించారు. వృషణాలు అభివృద్ధి చెందకపోవడంతో పాటు క్యాన్సర్ లక్షణాలు ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు.