ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రారంభమైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 582 జడ్పీటీసీ మరియు 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్ లో రెండు కోట్ల అరవై ఒక లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముప్ పై ఒక్క వేల నూట అరవై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, నలభై వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.