లవ్ అండ్ వార్ చిత్రానికి కీలక యుద్ధ సన్నివేశాల రీషూట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ముంబై
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ చిత్ర షూటింగ్ పూర్తయినప్పటికీ, కొన్ని యుద్ధ సన్నివేశాల పట్ల సంతృప్తి చెందకపోవడంతో ఆయన రణబీర్ కపూర్, ఆలియా భట్, వికీ కౌశల్ లపై ముంబైలోని గోరెగావ్ వెల్కమ్ మైదాన్ లో వారం రోజుల పాటు రీషూట్లు నిర్వహిస్తున్నారు. సినిమా కథలో ఈ వార్ సీక్వెన్స్ లు అత్యంత కీలకమని భావించి వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దేందుకు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.