మర్చంట్ నేవీలో చరిత్ర సృష్టించిన రితు కుమారి: తొలి మహిళా కెప్టెన్గా రికార్డు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mumbai
ఐఐటీ జేఈఈ పరీక్ష కోసం చదివిన బీహార్ కు చెందిన రితు కుమారి అనుకోకుండా మర్చంట్ నేవీ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని టి.ఎస్. చాణక్య ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పూర్తి చేసుకుని, పదహారు సంవత్సరాల సుదీర్ఘ సముద్ర ప్రయాణం తర్వాత గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ ట్యాంకర్ కు తొలి మహిళా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. పురుషులు ఆధిపత్యం చెలాయించే ఈ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు ఆమె తెలిపారు.