రాయమాధరం వరకు గోదావరి జలాలు అందించి పంటలను కాపాడాలి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఏన్కూరు మండలంలోని రాయమాధరం వరకు గోదావరి జలాల సరఫరా కొనసాగించి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. రాయమాధరం, తిమ్మరావుపేట గ్రామాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, మరో నెలపాటు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.