తిరుమలలో అత్యాధునిక డివోషనల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో భక్తుల కోసం ప్రత్యేక ‘డివోషనల్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ హీలింగ్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. ఏఐ, వీఆర్ సాంకేతికతలతో శ్రీవారి దివ్య చరిత్రను కళ్లకు కట్టేలా ప్రదర్శించే ఈ కేంద్రాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు దీని ద్వారా సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి కలగనుంది.