'తల్లుల గోప్యతకు ప్రత్యేక ప్రాధాన్యత': ఏలూరు బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

రిపోర్టర్: గోపి స్థలం: Eluru

ఏలూరు కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. తల్లుల గోప్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. బస్టాండ్‌కు వచ్చే బాలింతలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఎస్పీ తగు సూచనలు జేశారు.