తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా దూసుకువస్తూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ఈ వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో, తీర ప్రాంతాల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసి మత్స్యకారులను హెచ్చరించారు.