విద్యార్థులకు తీపి కబురు: దసరా సెలవులకు ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఆర్టీసి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

గ్రేటర్లో వసతిగృహాల్లో చదువుకునే విద్యార్థులు దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్ కుమార్ తెలిపారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ముప్పై మందికి తగ్గకుండా ఉంటే వారు ఉన్నచోటకే బస్సు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.