ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 30న అపోలో ఫార్మసీ జాబ్ మేళా

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: సికింద్రాబాద్

ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 30న ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ టి. రాము తెలిపారు. అపోలో ఫార్మసీ సహకారంతో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి రూ.16,583 నుంచి రూ.25,000 వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.