నగర ప్రయాణికులకు తీపి కబురు: కేవలం రూ. 600లకే ఆర్టీసి వీక్లీ పాస్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం ప్రయాణించే వారి కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అత్యంత పొదుపైన రూ. 600ల ప్రత్యేక వీక్లీ పాస్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు సాధారణ సిటీ బస్సులతో పాటు ఏసీ బస్సుల్లోనూ వారం రోజులపాటు ఎలాంటి పరిమితులు లేకుండా అపరిమితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు నడుస్తున్న పుష్పక్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు.