గణేష్ మండపాలకు ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 14 నుండి 22 వరకు ఈ సదుపాయం వర్తిస్తుందని, నిర్వాహకులు ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ డిస్కంలు స్పష్టం చేశాయి.