డక్కిలి మండలంలో రెండవ రోజు జోరుగా సాగిన ఎంపీటీసీ నామినేషన్లు
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎంపీటీసి నామినేషన్ల పర్వం రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగింది. పదకొండు స్థానాలకు వివిధ పార్టీల తరఫున నరవై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నుండి ఇరవై ఏడు మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై మంది నామినేషన్లు వేశారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.