బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ క్రికెటర్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుండటంతో కొత్త అభ్యర్థుల కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో పలువురు ప్రముఖ మాజీ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి.