దేశంలో శాంతిపై వ్యాఖ్యలు: స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడినట్లు సంజయ్ దత్ స్పష్టత

రిపోర్టర్: సునీల్ స్థలం: ముంబై

దేశంలో శాంతి లోపించిందంటూ తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక స్క్రిప్ట్ లో భాగమేనని బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలు కావని, ఒక టీవీ షోలో భాగంగానే వాటిని మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తన మాటలు ఎవరినీ నొప్పించేలా ఉద్దేశించినవి కాదని పేర్కొంటూ, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న విమర్శలపై సంజయ్ దత్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు.