పెంటగాన్ లీడర్ షిప్ మార్పులపై ట్రంప్ కీలక ప్రకటన: హెగ్సేత్ పనితీరు చాలా బాగుంది

రిపోర్టర్: కిరణ్ స్థలం: Washington

అమెరికా రక్షణ మంత్రి పదవి నుంచి పీట్ హెగ్సేత్ ను తొలగిస్తారన్న ప్రచారంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. హెగ్సేత్ చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసంటిస్ ను రక్షణ మంత్రిగా నియమిస్తారంటూ వస్తున్న ఊహాగానాలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. పెంటగాన్ నాయకత్వ మార్పులపై జరుగుతున్న చర్చలకు ఈ ప్రకటనతో తెరపడింది.