అంతర్జాతీయ బ్రాండ్కు అంబాసిడర్గా ఐశ్వర్య రాయ్: సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తాజాగా జేడబ్ల్యూ మారియట్ గ్లోబల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నటించిన బాలనటుడు నమాజ్ సింగ్ దివానా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి దిగిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఆమె ఎంతో దయగల మనిషని కొనియాడారు. ఐశ్వర్య రాయ్ ప్రేమ, దయకు ప్రతిరూపమని నటుడు ప్రశంసించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.