టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం: రూ.130 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా శ్రీవైష్ణవి డెయిరీ, భోలేబాబా, సుకృతి ఫుడ్స్ సంస్థలకు చెందిన సుమారు రూ.130 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ప్రమోటర్లు విపిన్ జైన్, కైలాశ్ చంద్ర మంగ్లాతో పాటు వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.