సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

ఐదేళ్లు చీకట్లో గడిపామని, ఈరోజు మా బతుకుల్లో వెలుగొచ్చిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల తమ సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటామని వారు స్పష్టం చేశారు. పేదలకూ పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల హక్కుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.