చిన్నారుల పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
విదేశీ ప్రయాణాలు చేసే చిన్నారుల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. మైనర్ల పాస్‌పోర్ట్ జారీ మరియు వాటి చెల్లుబాటు కాలంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్స్ సవరణ నిబంధనలు-2026ను తాజాగా నోటిఫై చేసింది. 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై 5 సంవత్సరాల పాటు మాత్రమే లేదా వారికి 18 సంవత్సరాలు నిండే వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.