రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో తీవ్రంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ (Telangana Weatherman - T. Balaji) వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెలను తలపించేలా తీవ్రమైన వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో 35 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు.