రోడ్లపై రీల్స్ ప్రమాదకరమని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

రోడ్లు ప్రయాణాల కోసమే తప్ప సోషల్ మీడియా రీల్స్ చేయడానికి కాదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. కొద్ది సెకన్ల కంటెంట్ కోసం ఎవరూ తమ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో లైకులు వస్తుంటాయని, పోతుంటాయని, కానీ ప్రాణం మాత్రం ఎంతో విలువైందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.