పాక్ క్రికెట్‌లో కలకలం, ఆటగాళ్ల మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పీసీబీ

రిపోర్టర్: రాము స్థలం: World

ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ అవుతుందన్న అనుమానాలతో ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. టెస్ట్ మ్యాచ్ ముగిసే వరకు ఫోన్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందని, ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.