మర్రిపాడు మండలంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లిలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది షేక్‌హనీ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త చాంద్‌బాషా మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో ఈఘటన జరిగింది. సోమవారం రాత్రి గొడవ తర్వాత భర్త పరారయ్యాడు. మృతురాలికి అయిదు నెలల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.