విజయనగరం జిల్లాలో నేరాల నియంత్రణకు ఆర్టీసీ కాంప్లెక్స్లో హై క్వాలిటీ సీసీ కెమెరాల ఏర్పాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

స్మార్ట్ పోలీసింగ్ విధానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో అత్యాధునిక హై క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు విజయనగరం పోలీస్ శాఖ వెల్లడించింది. ఈ నిఘా వ్యవస్థ ద్వారా అసాధారణ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన భద్రతా చర్యలు ముమ్మరం చేయనున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.