నెల్లూరులో రేషన్‌ పంచదార పక్కదారి దందా

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రేషన్‌ చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేయాల్సిన పంచదార పక్కదారి పడుతోంది. కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ రూ.90 లక్షలు స్వాహా చేస్తున్నారు. ఈ-పోస్ యంత్రాలను తప్పుదారి పట్టిస్తూ లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడంతో అక్రమాలు పెరిగిపోతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.