తుఫాన్ విలయంతో నీటమునిగిన పంటలు కన్నీరుమున్నీరవుతున్న వేలేరుపాడు రైతులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వేలేరుపాడు
వేలేరుపాడు మండలంలో మరుసు తుఫాన్ తీవ్ర విలయం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగి రహదారులు తెగిపోగా, వందల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి వరదలకు పంటలు నష్టపోయి ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు, తిరిగి సాగు చేయగా ఇప్పుడు రెండోసారి భారీగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమవుతున్నారు. పెట్టుబడులన్నీ వృధా కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.