అమరావతి ఉద్యోగుల ప్రయాణ ఇబ్బందులు: ఆర్టీసి బస్సులపై పెరుగుతున్న ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
అమరావతికి వచ్చే ఆర్టీసీ సిటీ బస్సుల్లో తమను ఎక్కించుకోవడం లేదని సీఆర్డీఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరు నుంచి రాకపోకలు సాగించే వేలాది మంది సిబ్బంది బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగులు వాపోయారు. ఖాళీలు ఉన్నప్పటికీ బస్సులు ఆపకపోవడంతో సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని వారు తెలిపారు. ఈ రవాణా సమస్యను వెంటనే పరిష్కరించి అన్ని బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు.