స్థానిక సంస్థల ఎన్నికలు: నామినేషన్ల అడ్డుకట్టపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను ఎవరైనా అడ్డుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆయన స్పష్టంగా ఆదేశించారు. అభ్యర్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.