సినిమా రంగంలోకి బిగ్ బాస్ విన్నర్: హీరోగా కళ్యాణ్ పడాల ఎంట్రీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది విజేత కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై జి. సంతోషి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు.