పోలవరం ప్రాజెక్ట్ పర్యటన వాయిదా: అక్టోబర్ 12కి మార్చిన పవన్ కల్యాణ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Eluru

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం మరోమారు వాయిదా పడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9న జరగాల్సిన ఈ పర్యటనను తాజాగా అక్టోబర్ 12వ తేదీకి మార్చడం జరిగింది. ఈ టూర్లో భాగంగా ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.