రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ సంస్థలను కోరిన మంత్రి లోకేశ్
రిపోర్టర్: హరి
స్థలం: దిల్లీ
దిల్లీలో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. అబాట్, సిస్కో, వివో సంస్థల అధిపతులతో భేటీ అయిన ఆయన, రాష్ట్రంలో వైద్య పరికరాలు, సాంకేతిక తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విశాఖపట్నంలో జీసీసీ ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉంచారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికీ, యువతకు ఉపాధి కల్పనకూ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు.