'ఇంటి ముంగిట ఆశీర్వాద దీపం వెలిగిద్దాం': ప్రధాని మోదీ సేవలను కొనియాడిన విజయేంద్ర ప్రసాద్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ సుపరిపాలన అందిస్తున్న మోదీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముంగిట 'ఆశీర్వాద దీపం' వెలిగించాలని ఆయన కోరారు. దేశం కోసం అంకితభావంతో పనిచేస్తున్న మహానీయుడికి కృతజ్ఞతాపూర్వకంగా దీపోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.