రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఖమ్మం

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో రోడ్డు భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రమాదకర, సున్నితమైన రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు రవాణా, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దివాకర టిఎస్ స్పష్టం చేశారు.