కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రజిత్ ఛటర్జీ సంచలన నిర్ణయం
రిపోర్టర్: గోపి
స్థలం: West Bengal
కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రజిత్ ఛటర్జీ ఎస్ఐఆర్ ట్రిబ్యునల్ హెడ్ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. రోజువారీ ప్రయాణ దూరం మరియు ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే తనకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తే పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ముర్షిదాబాద్ జిల్లాకు సంబంధించి ఓటర్ల తొలగింపు వ్యవహారాలపై ఏర్పాటైన ట్రిబ్యునల్‌కు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు.