మైసిగండి క్షేత్రంలో భక్తిశ్రద్ధల నడుమ సాగిన తలనీలాల వేలం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలోని ప్రసిద్ధ మైసమ్మ దేవత, శివాలయ, రామాలయ దేవస్థానంలో భక్తుల తలనీలాలు సేకరించే హక్కుల కోసం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం ఆరుగురు వేలందారులు పోటీ పడగా, జడ్చర్ల గ్రామానికి చెందిన వజ్రగిరి రామయ్య రూ.2,56,000 కు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రణీత్, కార్యనిర్వహణాధికారి వీరేశం, ట్రస్టీ లక్ష్మి, ఆలయ అర్చకులు యాదగిరి మరియు ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని వేలం ప్రక్రియను పర్యవేక్షించారు.