బడంగ్పేట్ లో కలకలం: ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారి అదృశ్యంపై పోస్టర్లు వెలిసి సంచలనం

రిపోర్టర్: సతీష్ స్థలం: బడంగ్‌పేట్

బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్ కు ప్రత్యేక అధికారి మహుమ్మద్ యాసిన్ కారణమని ఆరోపిస్తూ కార్యాలయ డోర్లపై స్టికర్లు వెలిశాయని, ఆయన కనబడటం లేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ఫైల్ క్లియరెన్స్ కోసం రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో, ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.