పెరుగుతున్న చమురు ధరలపై జి సెవెన్ దేశాల అత్యవసర సమావేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఫ్రాన్స్

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న చమురు, ఇంధన ధరలను నియంత్రించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూరప్‌లో యూరప్ డీజిల్ బెంచ్‌మార్క్ ధర బ్యారెల్‌కు 200 డాలర్లను దాటిన నేపథ్యంలో, వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసే అంశంపై చర్చించేందుకు త్వరలో జి సెవెన్ దేశాల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.