మహిళలను కించపరిచిన ఆర్టీసీ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా గోపాల్ పేట బస్టాండ్ లో హైదరాబాద్ నుండి వస్తున్న ఎక్స్ ప్రెస్ బస్సులో మహిళా ప్రయాణికులను కండక్టర్ కించపరిచే విధంగా మాట్లాడటంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బస్సు సరిగ్గా ఆపకుండా మహిళలు ఎక్కుతుండగా డ్రైవర్ ముందుకు కదపడం, కండక్టర్ వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పట్ల బాధితులు మండిపడ్డారు. దీనిపై వనపర్తి డీఎం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిచో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.