జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన త్రివేణి విద్యార్థులు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో త్రివేణి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. డిబేట్ విభాగంలో సోనాక్షి తృతీయ స్థానం సాధించగా, క్విజ్ పోటీలో విజయసహస్ర నాల్గవ స్థానంలో నిలిచారు. విజేతలకు జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల విజయం పట్ల పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరితో పాటు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.