పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా రాజీనామా
రిపోర్టర్: రమేష్
స్థలం: చండీగఢ్
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాల నేపథ్యంలో, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. గత కొంతకాలంగా రాష్ట్ర విభాగంలో కొనసాగుతున్న భేదాభిప్రాయాలు, అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2022 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన రాజీనామాతో త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.