రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఏలూరు

రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పేదల సేవలో కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.