నెట్‌ఫ్లిక్స్ సవాలును గెలిచి రూ. 40 కోట్లు రాబట్టిన మండాడి నిర్మాత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Chennai
రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కోలీవుడ్ సినిమా 'మండాడి'పై ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పెట్టిన బాక్సాఫీస్ సవాలును నిర్మాత ఎల్రెడ్ కుమార్ ధైర్యంగా స్వీకరించారు. థియేటర్లలో సినిమా సృష్టించిన సునామీతో సవాలు విజయవంతం కావడంతో, నెట్‌ఫ్లిక్స్ నిబంధనల ప్రకారం ఆయన ఏకంగా రూ. 40 కోట్ల భారీ మొత్తాన్ని రాబట్టబోతున్నారు. కంటెంట్‌పై నమ్మకంతో చేసిన ఈ సాహసం కాసుల వర్షం కురిపించింది.