ఆస్ట్రేలియాలో కప్పల బెడద నివారణకు భారీ ప్రాజెక్టు రూపకల్పన చేసిన పరిశోధకులు
రిపోర్టర్: అశోక్
స్థలం: Australia
ఆస్ట్రేలియాలో వేగంగా విస్తరిస్తున్న కేన్ టోడ్స్ కప్పల ముప్పును అరికట్టేందుకు ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్లు కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. బ్రూమ్ ప్రాంతంలో ఏడు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేర నీటి వనరులను నియంత్రించి డ్రై కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సరికొత్త వాటర్ లెస్ బ్యారియర్ ద్వారా కప్పల వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.