విమానయాన రంగంలో సరికొత్త చరిత్ర: రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
మరో రెండేళ్లలో దేశంలోనే తయారైన మేడ్-ఇన్-ఇండియా పౌర విమానాలను సొంతం చేసుకోబోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ విమాన తయారీ పర్యావరణ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా మరో వంద కొత్త విమానాశ్రయాలు రానున్నాయని ఆయన వెల్లడించారు.